![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -237 లో.....పెద్దసారు తన చెల్లి గురించి శకుంతలతో అంటుంటే శకుంతల కోప్పడుతుంది. అది గంగ వింటుంది. విని రుద్రకి వెళ్లి చెప్తుంది. పెద్దసారు వాళ్ళ చెల్లి లేదనుకుంట.. ఆ టాపిక్ తీస్తేనే మీ పెద్దమ్మ కోప్పడుతుంది. తను ఉంటే ఎక్కడున్నా మళ్ళీ ఇద్దరిని కలిపేవాళ్ళం.. అప్పుడు కుటుంబం సంతోషంగా ఉండేదని రుద్రతో గంగ అంటుంది. పెద్దనాన్న అసలు ఈ విషయం చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు.. అయన చెప్పకుండా మనం దీని గురించి తెల్సుకుంటే పెద్దనాన్నకి తెలిస్తే ఫీల్ అవుతాడని గంగతో రుద్ర అంటాడు.
ఆ తర్వాత పెద్దసారు చెల్లి సుధా తన భర్త విశ్వనాథ్ బాక్సింగ్ ఛాంపియన్.. సుధా దేవుడికి మొక్కుకుంటూ బాధపడుతుంది. మళ్ళీ ఈ ఊరుకి ఎందుకు వచ్చేలా చేసావ్.. నా వాళ్ళకి దూరం అయ్యాను.. నా కూతురు నాకు దూరం అయిందని ఏడుస్తుంటే విశ్వనాథ్ వచ్చి కోప్పడతాడు. నువ్వు ఇలా బాధపడొద్దని ముందే చెప్పానని కోప్పడతాడు. ఆ తర్వాత గంగ, రంగా టిఫిన్ చేస్తుంటే ఇందుమతి వచ్చి.. రాశి ఫలాలు బాగున్నాయని చెప్తుంది. తన దగ్గర ఫోన్ తీసుకొని రాశి ఫలాలు రంగా చదువుతాడు. అప్పుడే రాఘవ, సూర్య ఆఫీస్ కీ వెళ్తుంటే ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని పెద్దసారు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇజ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని గంగని ఎదురు రమ్మని చెప్తాడు పెద్దసారు. ఆ తర్వాత రుద్ర వచ్చి వాళ్ళకి అల్ ది బెస్ట్ చెప్తాడు. ఇంట్లో అందరు ఎవరిపనులకి వారు వెళ్ళిపోతారు. ప్రమీలని రుద్ర సూపర్ మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. మక్కమ్ ని పిలిచి కార్తీక్ గురించి అడుగుతాడు. కాసేపటికి కార్తీక్ వస్తాడు. కార్తీక్ తో రుద్ర మాట్లాడి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత విశ్వనాథ్ ని రుద్ర అకాడమీలో కలిసి మాట్లాడుతాడు. నీ బాక్సింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ అని రుద్రతో విశ్వనాథ్ అంటాడు. మరొకవైపు గంగ స్టోర్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ సుధాకి సంబందించిన జ్ఞాపకాలు ఉంటాయి. అప్పుడే శకుంతల వచ్చి. నువ్వు ఈ గదిలోకి ఎందుకు వచ్చావని కోప్పడుతుంది. ఆ తర్వాత సుధా ఫోటోని ఇషిక తీసుకొని వెళ్లి వీరుకి చూపిస్తుంది. ఈవిడే అనుకుంటా ఈ ఇంటికి ఆడపడుచు అని ఇషిక అంటుంది. అన్నీ కనుక్కుంటానని వీరు అంటాడు. నీకు హెల్ప్ చేస్తాను కానీ నువ్వు ఏం చెయ్యట్లేదని ఇషిక అనగానే.. నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను ఇషిక.. మీ అయన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని అందరు అనుకుంటున్నారు కానీ అది జరగదని వీరు అనగానే ఇషిక హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |